మ‌ణిక‌ర్ణిక వివాదంపై కంగ‌న వివ‌ర‌ణ‌

Tuesday, September 11th, 2018, 10:38:37 PM IST

గ‌య్యాలి క్వీన్ కంగ‌న ర‌నౌత్‌తో పెట్టుకుంటే ఏమ‌వుతుందో `మ‌ణిక‌ర్ణిక‌` ప్రాజెక్టుకు ప‌ని చేసేవాళ్ల‌కు తెలిసొస్తోంది. తానే ద‌ర్శ‌క‌త్వం, ర‌చ‌న‌, న‌ట‌న అంటూ తాట తీస్తోంది. ఆవిడ టార్చ‌ర్ త‌ట్టుకోలేక‌ ద‌ర్శ‌కుడు క్రిష్ హైద‌రాబాద్‌కి పారిపోయి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత సోనూసూద్ సైతం మ‌ణికర్ణిక లో న‌టించ‌బోన‌ని స్ప‌ష్టం చేశాడు. క్రిష్ వెళ్లాక తానే కెప్టెన్ సీట్‌లో కూచుని మొండిగా స‌వారీ చేస్తున్న కంగ‌నను త‌ట్టుకోలేక ఆ త‌ర్వాత నిర్మాత కూడా వైదొల‌గాడ‌ని ప్ర‌చారం సాగింది. ప‌ది రోజుల రీషూట్లు చేయాల్సి ఉంటే, మొత్తం స్క్రిప్టునే మార్చి, బ‌డ్జెట్లు పెంచేసి కంగ‌న ఆటాడుకోవ‌డం వివాదాస్ప‌దం అయ్యింది.

అయితే నిర్మాత ఈ విష‌య‌మై కొంగ‌న‌తో గొడ‌వ ప‌డి వెళ్లిపోయాడా? అని ప్ర‌శ్నిస్తే క్వీన్ షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చింది. గ‌త కొంత‌కాలంగా మ‌ణిక‌ర్ణిక చిత్రంపై సాగుతున్న ప్ర‌చార‌మంతా చెత్త ప్ర‌చార‌మ‌ని, లాజిక్ లేని న్యాస్టీ క‌థ‌నాలు ఇవ‌న్నీ అంటూ కొట్టి పారేసింది. మ‌ణిక‌ర్ణిక నిర్మాణ బాధ్య‌త‌లు చూస్తున్న జీ స్టూడియోస్ బిజినెస్ హెడ్ సుజ‌య్ కుట్టీ కొన్ని నెల‌ల క్రితం జీలో ఉద్యోగం మానేశారు. నా సినిమాని నిర్మిస్తోంది జీస్టూడియోస్ మాత్ర‌మే.. అని తెలిపింది. అయినా జీస్టూడియోస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న నెట్ వ‌ర్క్ గురించి తెలియ‌నిదా? ఆ సంస్థ సులువుగా త‌న సినిమాకి బిజినెస్ పూర్తి చేయ‌గ‌ల‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. జీస్టూడియోస్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలేవీ త‌న‌కు తెలియ‌వ‌ని, సుజ‌య్ వెళ్లిపోవ‌డానికి కార‌ణం న‌న్నొడ‌గొద్ద‌ని స్ప‌ష్టంగా క్లారిటీనిచ్చింది. చేసేది ఎంత చెత్త ప‌ని అయినా ఆన్స‌ర్ ప్రిపేర్డ్‌గా ఉంటేనే క్వీన్ కాగ‌ల‌రు.. అని నిరూపించింది మ‌రోసారి.

  •  
  •  
  •  
  •  

Comments