జాంబీ మృగాళ్లు వీళ్లంతా… క్వీన్ ఫైర్‌!

Friday, September 28th, 2018, 07:33:40 PM IST

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఏం చేసినా అది ఎటాకింగ్ గానే ఉంటుంది. కంగ‌న నాలుక ప‌దును గురించి తెలిసిన‌వాళ్లెవ‌రూ త‌న జోలికి వెళ్ల‌ర‌ని బాలీవుడ్‌లో చెబుతుంటారు. ఆ అనుభ‌వం ఎంద‌రికో ఎదురైంది. స్టార్ హీరో హృతిక్ రోష‌న్ అంత‌టివాడే కంగ‌నతో పెట్టుకోలేక చ‌తికిల‌బ‌డ్డాడు. అదంతా అటుంచితే తాజాగా త‌నూశ్రీ ద‌త్తాపై నానా ప‌టేక‌ర్ వేదింపుల వ్య‌వ‌హారంపై కంగ‌న కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

త‌నూశ్రీ ధైర్యాన్ని త‌న‌దైన శైలిలో కొనియాడిన కంగ‌న త‌న‌కు బాస‌ట‌గా నిలుస్తూ, ఒకానొక మీడియా లైవ్‌లో చెల‌రేగిపోయింది. మ‌నుషులుగా బ‌తికే అర్హ‌త ఈ జాంబీల‌కు లేదు.. అమ్మా నాన్న స‌రిగా నేర్పించ‌ని మృగాళ్లు వీళ్లంతా అంటూ తిట్టేసింది కంగ‌న‌. రాజా బేటాల‌కు అస‌లు ఏమీ నేర్ప‌రా? అంటూ పేరెంట్‌ని చెడామ‌డా క‌డిగేసింది.కంగ‌న మాట్లాడుతూ-“వేధింపుల‌పై మాట్లాడే హ‌క్కు ప్ర‌తి మ‌గువ‌కు ఉంటుంది. అవేర్‌నెస్ తీసుకురావ‌డం అవ‌స‌రం. ఈరోజుల్లో చాలా మంది మ‌గాళ్లు క‌నీస విలువ‌లు అయినా లేకుండా ఉన్నారు. రాజా బేటా(పుత్ర‌)ల వేదింపుల‌కు `నో` చెప్ప‌కూడ‌దా.. ఈ జాంబీల‌కు మానవ‌త్త‌మే లేదు. మ‌న లాంటి వాళ్ల‌ క‌థ‌లు బ‌య‌ట‌కు తెలియాలి. ఆడ‌ది ఎదురిస్తే ఎలా ఉంటుందో తెలియాలి. మ‌న లైఫ్ స్టోరీల‌కు ఎక్స్‌పైరీ తేదీ అన్న‌దే లేదు“ అంటూ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డింది. నానా ప‌టేక‌ర్‌కి వ్య‌తిరేకంగా త‌నూశ్రీ‌కి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్న నాయిక‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రియాంక చోప్రా, సోన‌మ్ క‌పూర్ త‌ర్వాత కంగ‌న కూడా ఈ రేస్‌లోకి వ‌చ్చి చేరింది.