ఫిట్‌నెస్ కోసం క్వీన్ తంటాలు

Friday, June 8th, 2018, 11:47:25 PM IST

జిమ్‌లో నిరంత‌రం కుస్తీలు ప‌డుతూ సెల‌బ్రిటీలు ఫిట్‌నెస్ మంత్రం ప‌ఠిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌ర శారీర‌క శ్ర‌మ‌తో చ‌లాకీత‌నం ఉంటుంది. దీనివ‌ల్ల ఆన్ లొకేష‌న్ మాంచి జోష్‌తో న‌టించేయొచ్చు. ఈ ర‌హ‌స్యం బాగా ఒంట‌ప‌ట్టించుకున్నారు కాబ‌ట్టే మ‌న క‌థానాయిక‌లంతా జిమ్ముల్లో ఇర‌గ‌దీస్తున్నారు. సుదీర్ఘ కాలం ఫిట్‌నెస్‌, ఆహారంపై శ్ర‌ద్ధ తీసుకుంటూ టీనేజీ గ్లింప్స్‌ని ఎప్ప‌టికీ కాపాడుకుంటున్నారు. బాలీవుడ్ క‌థానాయిక‌ల‌తో పాటు సౌత్ నాయిక‌లు ప్ర‌స్తుతం ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపిస్తున్నారు.

ఆ కోవ‌లోనే బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ క‌ష్టం అంతా ఇంతా కాదు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ పాత్ర‌లో విరోచిత పోరాటాలు చేస్తోంది. క‌త్తి యుద్ధాలు.. గుర్ర‌పు స్వారీ వంటి విద్య‌ల్ని కంగ‌న నేర్చుకుంది. ఈ సినిమా కోసం త‌న లైఫ్‌నే రిస్క్ చేసింద‌న్న ప్ర‌చారం ఉంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ధీర‌త్వం అనేది ఆహార్యం, శరీర‌భాష‌లో చూపించేది. అందుకే… ఇదిగో కంగ‌న ఏమాత్రం స‌మ‌యం చిక్కినా ఇలా జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఫిట్‌నెస్ విష‌యంలో అస‌లు రాజీకి వ‌చ్చేది లేద‌ని ఇలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీకే ఆ సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.