కంగనా మళ్ళీ నోటికి పని చెప్పింది! వంకర బుద్ధి ఇక మారద!

Tuesday, September 26th, 2017, 01:27:18 PM IST


కంగనా రనౌత్. ఈ పేరు తెలియని వారు ఇండియాలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కావడానికి ఎన్నో కష్టాలు పేస్ చేసి మహిళలు స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఆమెకు ఉన్న అలవాటు ఎప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు ఆమెను వ్యతిరేకించేలా చేస్తుంది. కంగనా తనకు తాను భారతీయ మహిళలందరికి తనొక ప్రతినిధి అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఆ ఫీలింగ్ లో ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హీరోల మీద, పురుషాదిక్యం మీద విమర్శలు చేస్తూ ఉంటుంది. కొంత మంది పనిగట్టుకొని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీలో వారసత్వం మీద కూడా విమర్శలు చేస్తుంది. తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలకి కారణం పురుషులే అని ఆమె ఫీలింగ్. అలా అని ఆమెకు అఫైర్స్ లేవా అంటే చాలా మందితో అఫైర్స్ నడిపింది అయితే ఆమె టార్చర్ భరించలేకో, ఇంకే కారణాల వలనో వారు కంగనాతో బ్రేక్ అప్ చెప్పుకున్నారు. సిమ్రాన్ సినిమాకి ముందు ఆమె ఆధిత్య పంచోలి మీద విమర్శలు చేసింది. దానికి ప్రతికా ఆమె ఆదిత్య పంచోలి నుంచి ఆయన భార్య నుంచి అదిరిపోయే రేంజ్ లో విమర్శలు ఎదుర్కొంది.

మరల తాజాగా మరో సారి ఆమె నోటికి పని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నవారు వారి కొడుకులని హీరోలు చేయడానికి ఇష్టపడతారు కాని, కూతుళ్ళని హీరోయిన్స్ గా చేయించడానికి ఇష్టపడరు. దీనిని బట్టి హీరోయిన్స్ మీద వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్ధమవుతుంది అనేసింది. అయితే బాలీవుడ్ లో అందరు అలా కాదు అని కూడా కాస్తా సముదాయించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేసింది అనేది అందరికి అర్ధమైంది. గతంలో షారుక్ ఖాన్ తన కూతురు గురించి చెబుతూ ఆమె బికినీ విస్తే కాళ్ళు విరిచేస్తా అన్నట్లు తెలుస్తుంది. అలాగే సంజయ్ దత్ కూడా తన కూతురు హీరోయిన్ అవుతా అంటే కళ్ళు, చేతులు కట్టి ఇంట్లో కూర్చోబెడతా అన్నాడు. ఇప్పుడు కంగనా విమర్శలు నేరుగా వాళ్ళిద్దరికీ దగిలాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆమె మాటలని షారుఖ్ సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. మొత్తానికి కంగనా సంపాదించుకున్న స్టేటస్, పేరు, కేవలం తన నోటి దురుసుతో పోగొట్టుకుంటుంది అని చాలా మంది అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments