మంచు కొండ‌ల్లో సొంతిల్లు క‌ట్టుకున్న‌ కంగ‌న ?

Sunday, January 21st, 2018, 09:21:26 PM IST

సొంతింటి క‌ల అనేది ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఒక్కొక్క‌రు స్థాయిని బ‌ట్టి సొంతింటి నిర్మాణం చేప‌డుతుంటారు. ఇటీవ‌లి కాలంలో ఐశ్వ‌ర్యారాయ్, సోన‌మ్ క‌పూర్‌, ప‌రిణీతి చోప్రా, సోనాక్షి వంటి స్టార్లు త‌మ‌కంటూ సొంత గూడును ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌కి ఏకంగా 20-30 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టి రిచ్ లొకేష‌న్‌లో జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటివి కొంద‌రైతే ఒక‌టికి రెండు కొనుక్కుంటున్నారు. బిగ్ బి కుటుంబం, కోహ్లీ వంటి వాళ్లు ఖ‌రీదైన విల్లాలు కొనుక్కున్నారు. ముంబై టాప్ సెల‌బ్రిటీస్ అంతా బాంద్రా లాంటి ఖ‌రీదైన చోట్ల అపార్ట్‌మెంట్ల‌ను సొంతం చేసుకుని న‌గ‌రాల్లో ఖ‌రీదైన లొకేష‌న్ల‌లో సొంత ఇళ్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

లేటెస్టుగా క్వీన్‌ కంగ‌న ర‌నౌత్ కూడా ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త సంత‌రించుకునే మంచు కొండ‌ల్లో అద్భుత‌మైన ఇల్లు నిర్మిస్తోంది. క్వీన్ సక్సెస్ త‌ర్వాత అందుకున్న డ‌బ్బును ఏకంగా మ‌నాలీలోని ఓ భారీ భ‌వంతి నిర్మాణానికి వెచ్చిస్తోందిట‌. దీనికోసం ఏకంగా 30 కోట్ల మేర వెద‌జ‌ల్ల‌డ‌మే గాకుండా, కేవ‌లం ఆ సైట్ కొనేందుకే 10 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని తెలుస్తోంది. ఆ భ‌వంతి కోసం 20 కోట్లు ఖ‌ర్చు చేసిందిట‌. వింటేజ్‌ యూరోపియ‌న్ స్టైల్‌లో ఈ భ‌వంతిని ప్ర‌ఖ్యాత ష‌బ్నామ్ గుప్తా డిజైన్ చేశారుట‌. క్వీనా మ‌జాకానా? అనే రేంజులో ఈ ఇల్లు ఉంటుందిట‌.