వాడు నన్ను కూడా అక్కడ తాకాడు… కంగనా రనౌత్

Saturday, June 8th, 2019, 12:07:39 AM IST

ఎల్లపుడు సంచలనాలతో సహవాసం చేసే బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ మళ్ళీ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. సామాజిక సమస్యలపై తనవంతుగా పోరాటాలు చేస్తూ ఇప్పటికి కూడా వార్తల్లో నిలుస్తుంది కంగనా రనౌత్. అయితే బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి హాజరైన కంగనా రనౌత్ మాట్లాడుతూ తనకు చిన్న తనంలో ఎదురైనటువంటి ఒక చేదు అనుభవాన్ని ఆ కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కంగనా తో పాటు దీపికా పదుకొనే, పరిణీతి చోప్రా కూడా హాజరయ్యారు… అయితే కంగనా చిన్నతనంలో చండీఘడ్ పాఠశాలలో చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక ఈవ్ టీజింగ్ గురించి వెల్లడించింది. “నాకు గుర్తుంది. నేను చండీఘర్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వెళ్తూ అమ్మాయిలను తాకడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఒక బైకర్ చాలా వేగంగా నా వైపుకి వచ్చి నా ఛాతీపై గట్టిగా కొట్టాడు. ఆ హఠాత్పరిణామానికి షాకైన నేను 5 నిమిషాల వరకు తేరుకోలేకపోయాను. ఆలా తేరుకోగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన “ఎవరైనా దీనిని చూశారా ?” అంటూ కంగనా తనకు ఎదురైన ఘటనను చెప్పుకొచ్చింది. అయితే కంగనా మాటలు విన్నటువంటి మరో కథానాయిక పరిణీతి చోప్రా స్పందిస్తూ “ఇలాంటి సందర్భంలో జనాలు అమ్మాయేదో తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారు” అని అన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కాగా ఇలాంటి గతనాలు మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలని అధికారులని వేడుకున్నారు.