అరుణిమ సిన్హా బయోపిక్ లో కంగనా ?

Monday, November 6th, 2017, 03:23:34 PM IST

బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయాన్ని అందుకోవడంతో ఆ తరహా సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బయోపిక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఒంటికాలితో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా జీవిత కథను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె జీవిత కథతో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది ఎవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్? ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణికా చిత్రంలో నటిస్తున్న కంగనా నెక్స్ట్ సినిమా అదే. ఈ సినిమాకోసం ముందు కృతి సనన్ ని అడిగారట కానీ ఆమె నో చెప్పడంతో కంగనా దగ్గరికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళింది. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా ఉన్న అరుణిమ సిన్హా ను 2011లో రన్నింగ్ ట్రైన్ నుండి తోసేయడంతో ఆమెకు కాలు తొలగించారు. అయినా ఎంతో మనో ధైర్యంతో ఒంటికాలుతో ఎవరెస్ట్ ని ఎక్కి తన సత్తా చాటింది.

  •  
  •  
  •  
  •  

Comments