క్వీన్ దర్శకుడు నన్ను లైంగికంగా వేధిచాడన్న కంగనా ?

Monday, October 8th, 2018, 01:30:08 PM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపింది. ఇప్పటికే సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఓ రేంజ్ లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ వ్యవహరమ్ పై ఘాటుగానే బాహాటంగా స్పందిస్తున్నారు. తాజాగా ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని ఘాటు కామెంట్ చేసింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ? ఆ దర్శకుడు ఎవరో కాదు .. బాలీవుడ్ లో తనకు గొప్ప చిత్రంగా క్వీన్ చిత్రాన్నీ అందించిన వికాస్ బెహెల్ ? ఈ సినిమా షూటింగ్ టైం లో తనతో చాలా క్లోస్ గా ఉన్నట్టు నటించే వాడని, విషెష్ చెబుతున్నట్టు చెప్పి గట్టిగ కౌగిలించుకునేవాడని కామెంట్స్ చేసింది. తాజాగా నానా పాటేకర్ పై తను శ్రీ దత్త చేసిన కామెంట్స్ చల్లారకముందే కంగనా మరో బాంబు పేల్చడంలో బాలీవుడ్ లో వేడి అలుముకుంది. ఈ విషయం పై కంగనా స్పందిస్తూ .. వికాస్ కు పెళ్లయింది .. అయినా తనను విష్ చేసినట్టు చేస్తూ గట్టిగ కౌగిలించుకుని నలిపేసేవాడని పేర్కొంది. అతనికి ఇప్పటికే పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది మొత్తానికి ఫైర్ బ్రాండ్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు హీరో క్రిష్ తో కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది .. అతగాడితో ఘాటు ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. మరి ఈ అమ్మడు ఇంకెన్ని కామెంట్స్ చేస్తుందో అని షాక్ అవుతున్నారు అందరూ .