పద్మావతి కి మద్దతివ్వన్నన్న బాలీవుడ్ హీరోయిన్

Monday, December 4th, 2017, 06:29:30 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ లో పద్మావతి సినిమాపై వివాదాలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విడుదల తేదీపై ఇంకా ఏ సమాచారం లేదు. అసలు విడుదల అవుతుందా లేదా అనేది కూడా డౌటే. ఇప్పటికే చిత్ర యూనిట్ పై కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. చరిత్రను వక్రీకరించారని వారి తలలు తెగుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ విషయంపై పలువురు బాలీవుడ్ నటీనటులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీపికకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ప్రముఖ నటి షబనా అజ్మీ దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ బాలీవుడ్‌ ప్రముఖుల సంతకాలతో కూడిన పిటిషన్‌ను ప్రధానికి సమర్పించేందుకు చొరవ తీసుకున్నారు. అయితే అందరు దీపికకు మద్దతు ఇవ్వగా.. కంగనా మాత్రం ఇవ్వనని చెప్పిందట. ఓ వెబ్ సైట్ తెలియజేసిన ఈ సమాచారం ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా హాట్ టాపిక్ అయ్యింది. అయితే గత కొంత కాలంగా కంగనా రనౌత్ పై బాలీవుడ్ ప్రముఖులు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా దీపికా కూడా గతంలో కంగనాపై పై సెటైర్ వేసిందని ఒక టాక్ ఉంది. అందువల్ల కంగనా దీపికకు మద్దతుగా సంతకం చేయలేదని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments