పొట్టి నిక్క‌రులో క్వీన్‌ స్ట‌న్నింగ్ లుక్‌

Thursday, May 3rd, 2018, 10:23:44 PM IST

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటుంది. చీర‌లో.. చుడీదార్‌లో.. మిడ్డీలో.. బికినీలో ఎలా చూసినా త‌న‌లో ఏదో ఒక కొత్త కోణం బ‌య‌ట‌ప‌డుతుంది. అందుకే ఆ అందానికి ఫిదా అయిన పూరి- ప్ర‌భాస్ బృందం అప్ప‌ట్లో ఓ తెలుగు సినిమాలోనూ అవ‌కాశం ఇచ్చింది. అయితే ఇక్క‌డ వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు కానీ, ఆ త‌ర‌వాత బాలీవుడ్‌లో మాత్రం రారాణిగా ఎదిగింది కంగ‌న.

అదంతా స‌రే.. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక చిత్రంతో బిజీ బిజీగా ఉన్న కంగ‌న ఉన్న‌ట్టుండి ఇలా పొట్టినిక్క‌రులో ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ఇచ్చిందేంటి? ఉన్న‌ట్టుండి ఇలా నిక్క‌రులో ద‌ర్శ‌న‌మిచ్చిందేంటి? అప్ప‌టికే ఝాన్సీరాణిగా ఊహించుకున్న జ‌నాల‌కు అభిన‌వ నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ‌గా క‌నిపించ‌డం ఊహించ‌ని షాక్‌కి గురి చేసింది. ఇంత‌కీ ఈ డ్రెస్ ఖ‌రీదు ఎంత‌? అంటే ల‌గ్జ‌రీ మాల్‌లో కొనుక్కుంది కాబ‌ట్టి, వేల‌ల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు. అలాగే ఆ వెన‌క త‌గిలించుకున్న బ్యాక్ ప్యాక్ (లూయిస్ వుట్టియాన్ ల‌గ్జ‌రీ బ్యాగ్‌) ని చూశారా? కాలేజ్ గాళ్‌లా ఆ సోకులేంట‌మ్మా? అని అడ‌గాల‌నుందా? ఆ బ్యాగు ఖ‌రీదు 1.34ల‌క్ష‌లు. డ‌బ్బులేమైనా చెట్టుకు కాస్తున్నాయా? అని అడుగుతారా? అస్స‌లు వ‌ద్దే వ‌ద్దు. ఎవ‌రు సంపాదించుకున్న‌ది వాళ్లు ఖ‌ర్చు చేసుకుంటారు. అడిగేందుకు మ‌నం ఎవ‌రం? కిల్లాడీ నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ ఇలా ముంబై విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

  •  
  •  
  •  
  •  

Comments