పిక్ టాక్‌: `కంగారూ`ల కొత్త ఫ్రెండ్‌?

Monday, April 16th, 2018, 09:48:49 PM IST

కంగారూ జంతువు ఏ దేశానికి జాతీయ జంతువు? .. ఈ ప్ర‌శ్న‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం చెప్పేస్తాం. ఆస్ట్రేలియా ఐడెంటిటీనే కంగారూ.. ఆసీస్‌ అన్న మాట వినిపిస్తే వెంట‌నే కంగారూ గుర్తొస్తుంది. అక్క‌డ అనునిత్యం కంగారూల విన్యాసాలు క‌ట్టిప‌డేస్తాయి. సాధు జంతువు అయిన కంగారూ మ‌నుషుల‌తో ఈజీగా క‌లిసిపోతుంది. మ‌నుషుల్లోనే తిరుగుతూ ముద్దొచ్చేస్తూ ఉంటుంది.

ఇదిగో అలానే కంగారూలు ఓ కొత్త ఫ్రెండుతో చెలిమి చేశాయి. ఆ కొత్త ఫ్రెండ్ హ్యాట్ పెట్టుకుని ఎంతో అందంగా న‌వ్వులు చిందిస్తూ .. నాక్కూడా మంచి ఫ్రెండ్స్ దొరికారంటూ తెగ సంబ‌ర‌ప‌డిపోతోంది. ఆస్ట్రేలియా ట్రిప్‌లో ప‌రిణీతి ఫుల్‌గా ఎంజాయ్ చేసిందిలా. నా ఫ్రెండ్‌ను క‌ల‌వాల‌నుకుంటే క‌ల‌వండి. మెల్‌బోర్న్ బ‌ల్లార‌త్‌లో నా స్నేహితులు ఇరిగో.. అంటూ ట్వీట్ చేసింది. గుడ్ ఫ్రెండ్స్‌..