జగన్ సర్కార్ పై కన్నా లక్ష్మి నారాయణ ఆగ్రహం…ఎందుకో తెలుసా?

Saturday, November 9th, 2019, 07:58:22 AM IST


జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై టీడీపీ, జనసేన లతో పాటుగా బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం ప్రతి పక్షాలకు మరొకసారి వరమైంది. ప్రభుత్వ పాఠశాలలో ఇక పై ఇంగ్లీష్ మీడియం లో నే ఉండేలా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపేంది. అయితే జనసేన, టీడీపీ లు స్పందించి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించగా ఇపుడు కన్నా లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం భోదన మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం అని కన్నా లక్ష్మి నారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. ముందస్తు శిక్షణ, సంశయం లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని జగన్ ప్రభుత్వం పై మండి పడ్డారు. రానున్న తరాల పై ప్రభావితం చేసేలా, ప్రభుత్వం అవగాహనా లేని నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రాలన్నీ వారి మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ బిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అంతే కాకుండా దీనికి సంబందించిన జి.ఓ ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు.