వైసీపీ ప్రభుత్వ వైఖరి కి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్ష!

Monday, May 25th, 2020, 02:34:37 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల వెంకన్న స్వామికి భక్తులు ఇచ్చిన భూములను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న కు భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు మీకేవరు ఇచ్చారు అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వైఖరి కి, నిరసన గా రేపు అనగా, మే 26 న రాష్ట్ర వ్యాప్తంగా వెంకన్న భక్తులు బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఇంటి వద్ద ఉపవాస దీక్ష చేపట్టాలి అని పిలుపు ఇచ్చారు.

అయితే కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలకు గానూ నెటిజన్లు స్పందిస్తున్నారు. టీటీడీ ఆస్తులకు కపాల దారుడు ప్రభుత్వం అని, డబ్బుల కోసం ఆస్తులను అమ్ముకొనే హక్కు లేదు అని కొందరు అంటున్నారు. అంతేకాక దీనిని అందరూ ప్రశ్నించాలి అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి హయాంలో కూడా ఇలా జరిగింది అని అన్నారు. అయితే ఇందుకోసం టిడిపి అప్పట్లో ఒక కమిటీని వేసి, అప్రూవ్ చేసింది అని, అందులో బీజేపీ కి చెందిన ఒక వ్యక్తి మెంబర్ గా కూడా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక దీనికి జగన్ ను అనడం కరెక్ట్ కాదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.