మీకు, బాబుగారికి పెద్ద తేడా లేదు.. జగన్‌పై కన్నా సంచలనం..!

Tuesday, October 8th, 2019, 09:07:07 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలే గడిచినా ఆయన పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బాబుకి మీకు పెద్దగా ఏమి తేడా లేదని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసాడు, మీరు అంతకుమించి అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చేశారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.