జగన్ 100 రోజుల పాలనా పై కన్నా సంచలన వ్యాఖ్యలు…

Tuesday, September 10th, 2019, 01:00:27 PM IST

ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన వైసీపీ ఎన్నికల ముందు ఒకళా , ఆ తర్వాత ఒకళా ప్రవర్తిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ ఆరోపించారు. గడిచిన వంద రోజుల పాలన పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వ్యక్తులు మారారు కానీ వ్యవస్థ అలానే ఉందని అన్నారు. జగన్ పొంతనలేని మాటలు, ఇచ్చిన హామీల పై ఎద్దేవా చేసారు. పాలన పై పట్టు కోల్పోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతులకి 12 వేల రూపాయలు పెట్టుబడి ఇస్తానని తెలిపి, కేంద్రం నిధుల్ని అందులో కలపడం బాధాకరం అని తెలిపారు.

అంతేకాకుండా ఇసుక కొరత పై, వాటి వల్ల కార్మికులకు పని దొరకపోవడం పై జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఆన్ లైన్ విధానం సరిగా పని చేయడం లేదని తెలిపారు. గ్రామా వలంటీర్ల విషయం లో జగన్ పై దారుణంగా కామెంట్ చేసారు, జన్మభూమి కమిటీల పేరు మర్చి ఈ గ్రామా వాలంటీర్లను చెరచారని ఎద్దెవా చేసారు. రివర్స్ టెండరింగ్ విధానం తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిందని ఆరోపించారు. జగన్ చేసే ప్రతి పని ప్రభుత్వం పై అదనపు భారాన్ని పెంచేలా ఉందని కన్నా వ్యాఖ్యలు చేసారు.