భర్తపై కేసు పెట్టిన సినీనటి.. అక్రమ సంబంధమే కారణం!

Wednesday, March 21st, 2018, 11:04:47 AM IST

 

కన్నడ ప్రముఖ నటి చైత్ర వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా మీడియాల్లో సంచలనంగా మారింది.  ఆమె భర్తపై పోలీసు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా తన భర్త చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. 2006లో ఇష్టపడి చైత్ర  లిక్కర్ బిజినెస్ మెన్ రియల్టర్ బాలాజీ పోతరాజ్ ని వివాహం చేసుకుంది.

అయితే కొన్నేళ్ల వరకు బాగానే సాగిన వారి జీవితంలో ఇటీవల కొన్ని పరిస్థితుల కారణంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు చైత్ర పోలీసులకు తెలియజేసింది. మరో యువతితో గత కొంత కాలంగా ప్రేమను కొనసాగిస్తున్నట్లు మీడియాకు కూడా బహిరంగంగా సమాధానం ఇవ్వడం సెన్సేషన్ అయ్యింది. తనపై భర్త దాడికి దిగినట్లు కూడా చైత్ర ఆరోపణలు చేసింది. గోడకేసి కొడుతూ పిడిగుద్దులు కురిపించాడని నేను స్పృహ కోల్పోయిన అనంతరం వదిలిపెట్టి వెళ్లాడని  బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక తన భర్తపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చైత్ర పేర్కొంది.