శృతి హాసన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన .. హీరో ?

Friday, October 13th, 2017, 10:19:09 AM IST

గ్లామర్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ పై సౌత్ జనాలు మండి పడుతున్నారు. ముక్యంగా కర్ణాటకలో శృతి అంటేనే ఫైర్ అవుతున్నారు .. తాజాగా అసలు కన్నడ సినిమాలు ఛస్తే చేయనని ప్రకటించినప్పటి నుండి ఈమెకు కష్టాలు ఎక్కువయ్యాయి? తాజాగా ఓ కన్నడ సినిమాకోసం దర్శక నిర్మాతలు ఆమె నటిస్తుందని ప్రకటించారు .. కానీ ఆ తరువాత ఆమెను అడిగితె బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నాను నో అని చెప్పిందట ..దాంతో పాటు అసలు కన్నడ సినిమాల్లో చేయనని ప్రకటించే సరికి కన్నడ హీరో జగ్గేష్ కు వొళ్ళు మండింది .. శృతి హాసన్ ను మేకప్ లేకుండా చూడలేమని .. ఆమెను మించిన అందెగత్తలు కర్ణాటకలో ఉన్నారంటూ ఫైర్ అయ్యాడు ? ఇలా పరభాషా హీరోయిన్స్ పై పడి ఏడవడం ఎందుకు .. సొంత భాషలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహించండి అంటూ చెప్పాడు. అలాగే తమిళంలో ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సంఘమిత్ర సినిమా నుండి తప్పుకోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఈ మధ్య శృతి హాసన్ కు తలపొగరు బాగా పట్టిందని సినిమా జనాలు అంటున్నారు. అలాగే తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమా లేకుంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేదని, ఇప్పుడు ఇక్కడ అవకాశాలు వస్తున్నా కూడా పెద్దగా పోజు కొడుతూ తెగ బిల్డప్ ఇస్తుందని అంటున్నారు. పోనీ ఆమె బాలీవుడ్ లో ఎదో పెద్దగా వెలగబెడుతుందా అంటే అదీలేదు .. కొత్త హీరోకి చెల్లెలి పాత్రలో చేసింది .. ఆ సినిమా కూడా డాం అంది. ప్రస్తుతం ఎక్కడ సరైన విజయాలు లేని శృతి పై మరో కొత్త రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.. డెడికేషన్ గా పనిచేయదని, సమయానికి రాదని అంటున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకుంటుందేమో చూడాలి.