జగన్ తీసుకున్న నిర్ణయం కర్నాటకలో కూడా చిచ్చు రేపిందిగా..!

Monday, August 12th, 2019, 08:02:12 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అన్ని రాష్ట్రాలను ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో కర్ణాటకలో కూడా చిచ్చు రేపుతుంది.

ఏపీలో నెలకోల్పే పరిశ్రమలలో, కంపెనీలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ జీవో ఒకటి ప్రకటించాడు. అయితే దీనిపై కొందరు నేతలు అది సాధ్యం కాదని, రాజ్యంగ విరుద్ధమని అలా చేస్తే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారని ఫలితంగా రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా జగన్ మాత్రం దీనిపై అసలు వెనక్కు తగ్గలేదు. అయితే ఇదే అంశం ఇప్పుడు కర్ణాటకలో కూడా తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రాజకీయాలలో చురుకుగా ఉంటున్న నటుడు ఉపేంద్ర కర్ణాటకలో కూడా 75% ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై ఈ నెల 14,15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. తన దీక్షకు కర్ణాటక యువత మద్ధతు తెలపాలని కూడా పిలుపునిచ్చారు. అయితే ఏపీ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పెద్దగా పరిశ్రమలు, కంపెనీలు లేవు. కానీ కర్నాటక రాజధాని బెంగళూరు దేశ ఐటీ రాజధాని కావడంతో అన్ని రాష్ట్రాల వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అలా కాకుండా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వడమనేది అసలు జరిగే పని మాత్రం కాదనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునే అవకాశం దేశ ప్రజలకు ఉంది. అలాంటి చట్టాన్ని ఇప్పుడు తుంగలో తొక్కి మిగతా రాష్ట్రాల వారికి అన్యాయం చేసే పనికి కేంద్ర ప్రభుత్వం అసలు ఒప్పుకోదనే చెప్పాలి. అయితే ఉపేంద్ర చేస్తున్న దీక్ష దానిపై ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందనేది తెలియాలంటే మాత్రం కాస్త వేచి ఉండాల్సిందే.