నిర్మాతకు ప్రేమ పెళ్లి చేసిన స్టార్ హీరో!

Friday, March 9th, 2018, 09:29:08 PM IST


సినిమాలో అయితే ఇద్దరి ప్రేమికులను ఈజీగా కలిపినట్టు చూపించేస్తారు. హీరో దగ్గరుండి వారి పెళ్లి చేయడం ఆ తరువాత కుటుంబ సభ్యుల కంట పడకుండా తీసుకెళ్లడం సినిమాల్లో ఎన్నో చూస్తుంటాం. అయితే రీసెంట్ నిజమైన హీరో రియల్ లైఫ్ లో నిర్మాత పెళ్లిని దగ్గరుండి జరిపించాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో వారిని హాజరుపరచడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.

అసలు వివరాల్లోకి వెళితే.. కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్‌గౌడ మరియు అక్కడి మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోవగలని అనుకున్నారు. అయితే శుక్రవారం లక్ష్మి సడన్ గా కనిపించకపోవడంతో శివమూర్తి స్థానిక యలహంక పోలీస్‌ స్టేషన్‌ పిర్యాదుయి చేశాడు. విషయం తెలుసుకున్న కన్నడ హీరో దునియా విజయ్‌ శుక్రవారం అదే పోలీస్ స్టేషన్ కు ప్రేమ జంటను తీసుకువచ్చి సిఐ మంజునాథ్ ముందు జరిపించాడు. సిఐ ముందు వారిద్దరిని విచారించగా ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నట్లు చేప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇక పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన లక్ష్మి కుటుంబ సభ్యులు లక్ష్మిని చూసి కన్నీరు కార్చారు. తల్లి రా అని పిలిచినా లక్ష్మి వెళ్లలేదు.

  •  
  •  
  •  
  •  

Comments