పద్మావతికి కన్నడ సూపర్ స్టార్ సపోర్ట్ ?

Friday, December 1st, 2017, 02:33:40 PM IST

బాలీవుడ్లో పెను సంచలనం క్రియేట్ చేస్తున్న పద్మావతి సినిమా పై కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్పందించాడు .. పద్మావతి సినిమాలాగే తన సినిమాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని, ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఈ తరహా అంశాలను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని అయన కోరారు. మనకు ఓ వ్యవస్థ ఉందని, దాన్ని పాడు చేసుకుంటే సమాజం ఏమవుతుందని అన్నారు. చట్టబద్దంగా పాటించాల్సిన కొన్ని నిబంధనలు ఉన్నాయని, సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు ఉందని అన్నారు. నచ్చని విషయం గురించి నిరసన వ్యక్తం చేయొచ్చని .. కానీ దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. ఆ దర్శకుడు కూడా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే సినిమా తీసి ఉంటాడని పేర్కొన్నాడు. ఇక పద్మావతి సినిమా నిజానికి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా .. నిరసనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాయిదా వేశారు.

  •  
  •  
  •  
  •  

Comments