క‌పూర్ గాళ్స్ లైంగిక వేదింపుల‌పై స్పీచ్‌!

Sunday, February 18th, 2018, 09:35:13 PM IST


మార్చి 8 అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంను పుర‌స్క‌రించుకుని మ‌హిళామ‌ణుల‌పై స్పెష‌ల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పురుషాధిక్య ప్ర‌పంచంపైనా, లైంగిక వేదింపుల‌పైనా ఇటీవ‌లి కాలంలో ఓ ర‌క‌మైన రివల్యూష‌న్ స్టార్ట‌య్యింది. మి టు హ్యాష్‌ట్యాగ్ తెచ్చిన విప్ల‌వం అంతా ఇంతా కాదు. ఇదే నేప‌థ్యంలో క‌పూర్ గాళ్స్ క‌రిష్మా క‌పూర్‌, క‌రీనా క‌పూర్ లైంగిక వేదింపుల‌పైనా స్పందించ‌నున్నారుట‌. మార్చి 10న ముంబైలో ఉమెన్స్ కాన్‌క్లేవ్ స‌ద‌స్సులో క‌పూర్ సిస్ట‌ర్స్ క‌రిష్మా క‌పూర్‌- క‌రీనాక‌పూర్ మ‌హిళామ‌ణుల పురోగ‌తిపై స్పీచ్ ఇవ్వ‌నున్నారు. ఇందులో మ‌హిళ‌ల‌పై లైంగిక వేదింపులు, బాలీవుడ్‌లో పురుషాధిక్యంపైనా మాట్లాడుతార‌ట‌.

అస‌లు క‌పూర్ల వంశం నుంచి ఆడ‌పిల్ల సినిమా రంగంలోకి రావ‌డ‌మే గొప్ప‌. అలాంటిది క‌రిష్మా క‌పూర్ రూల్స్‌ని బ్రేక్ చేసి క‌థానాయిక అయ్యింది. అక్క‌డ అగ్ర నాయిక‌గా కిరీటం అందుకుంది. గొప్ప అభిమానుల్ని సంపాదించుకుంది. అనంత‌రం త‌న సోద‌రి క‌రీనాక‌పూర్ పెద్ద స్టార్‌గా ఎదిగింది. సైఫ్‌ని పెళ్లాడి తైమూర్‌కి త‌ల్లి అయ్యాక కూడా క‌రీనా కెరీర్ ప‌రంగా బిజీ ఉండ‌డం చూస్తుంటే ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యాల‌న్నిటినీ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతారుట‌.