ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం.. కాపు ఉద్యమానికి గుడ్‌బై..!

Monday, July 13th, 2020, 02:45:24 PM IST

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటిస్తూ, ఈ మేరకు కాపులకు బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారని, ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదని అన్నారు.

అయితే ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా ఈ దాడికి కారణం అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు కారణంగానే తాను ఉద్యమంలోకి వచ్చానని, ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని అన్నారు. .కాపు జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాపు రిజర్వేషన్ల అంశం గురుంచి ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన మాట గురుంచి గుర్తు చేస్తూ లేఖ కూడా రాశారు ముద్రగడ. అయితే ఇంతలోపే తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చర్చానీయంశంగా మారింది.