కరణ్ జోహార్ కు అరుదైన గౌరవం దక్కింది ?

Thursday, April 19th, 2018, 01:29:15 PM IST

బాలీవుడ్ క్రేజీ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అయన లండన్ లోని టుస్సాడ్ మ్యూజియం లో మైనం బొమ్మను పెట్టె అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పటికే ఇండియన్ స్టార్స్ అమితాబ్, కరీనా, షారుఖ్, దీపికా, ఐశ్వర్యారాయ్, ప్రభాస్ లాంటి ఎందరో నటీనటులకు చోటు దక్కింది. అయితే మొదటి సారి ఓ దర్శక నిర్మాతకు ఈ క్రేజ్ దక్కడం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్ లో కరణ్ జోహార్ అంటే ఓ బ్రాండ్ అయన బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే చాలు దానికి ఓ రేంజ్ క్రేజ్ వస్తుంది. 1998 లో కుచ్ కుచ్ హోతాహై సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన కరణ్ జోహార్. బాలీవుడ్ లో పాపులర్ దర్శకుడిగా మారాడు. ఇప్పటికే మ్యూజియం క్రియేటర్స్ అయన దగ్గరికి వెళ్లి .. కొలతలు తీసుకున్నారట.