అన్న .. ఏక్తా కపూర్ బాటా పట్టాడా .. ఏంటి ?

Sunday, November 12th, 2017, 10:00:03 PM IST

బాలీవుడ్ లో హాట్ హాట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అందరు చెప్పే ఒకే ఒక్క పేరు .. ఏక్తా కపూర్? డర్టీ పిక్చర్ సినిమాతో ఆమె బూతు ప్రయాణం మొదలు పెట్టి .. వరుసగా అడల్ట్ కంటెంట్ తో సినిమాలు చేస్తుంది. అయితే అటు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకుంటుంది. తాజాతా ట్రిపుల్ ఎక్స్ పేరుతొ ఓ ఘాటు సినిమానే తీస్తుంది. అందుకే చాలా మంది ఆమె దారిలోనే వెళ్లాలని అడల్ట్స్ కామెడీ లను తీస్తున్నారు. తాజాగా వాళ్ళదారిలోకి ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ? బాలీవుడ్ లో కరణ్ జోహార్ సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే యాష్ చోప్రా తరువాత ఆ రేంజ్ మేకర్ గా ఇమేజ్ తెచ్చుకున్న కరణ్ జోహార్ ఈ సారి అడల్ట్ కామెడీ సినిమా తీస్తున్నాడట !! ఆ మధ్య తీసిన బాంబే టాకీస్ సినిమాకు సీక్వెల్ గా ఇది ఉంటుందని. లవ్, లాస్ట్ ల మధ్య ఉన్న చిన్న తేడా నేపథ్యంలో కథ సాగుతుందట. భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, పూర్తీ స్థాయిలో కామెడీ ఎంటర్ టైనర్ గా సాగుతుందట. ఇప్పటికే హీరోగా విక్కీ కౌశల్ ని ఎంపిక చేసాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Comments