షాక్ … కరణ్ జోహార్ కు సినిమా కష్టాలు ?

Saturday, February 11th, 2017, 08:37:51 PM IST


దేవుడా … ఇలాంటి అపవాదు పగవాడికి కూడా రాకూడదు .. అన్న పదం చాల సార్లు మనం వినే ఉంటాం ? ఇప్పుడు అచ్చంగా అలాంటి డైలాగ్ ను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ అంటున్నాడు !! అవునా ఆయనకు అంత కష్టం ఏమొచ్చింది ? అని షాక్ అవుతున్నారా . ఈ మేటర్ వింటే .. మీరే అయ్యో .. అంటారు !! అసలు విషయం ఏమిటంటే .. ఈ మధ్య తన ఆత్మ కథ రాసి విడుదల చేసినప్పటినుండి తన లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని కరణ్ జోహార్ వాపోతున్నాడు ? ముఖ్యంగా ఆయనకు మీడియా నుండి వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నాడు ? ఎందుకంటే కరణ్ జోహార్ .. తాను ” గే ”అని ఆ కథలో చెప్పినప్పడి నుండి. అయన ఏ మగాడితో తిరిగినా అతనితో సంబంధం ఉందా అంటూ ప్రశ్నలు వేసి చంపుతున్నారట ? ప్రస్తుతం మగాళ్లతో బయట కనిపించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని వాపోయాడు!! ఈ మద్యే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి కనిపించాడు కరణ్ .. వెంటనే అతనితో మీకు ఆ .. సంబంధం ఉందా ? అంటూ అడుగుతున్నారు అని, ఇద్దరు మగాళ్లు కలిసి డిన్నర్ చేస్తే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నాడు ? అవునులే .. అసలు విషయం చెప్పిన తరువాత .. ఏ పని చేస్తున్న ఇలాంటి నిందలు తప్పవుగా మరి !!