ట్రెండీ టాక్‌ : శ్రీ‌కాకుళం వెయిట్‌లిఫ్ట‌ర్‌ మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌..

Saturday, June 2nd, 2018, 11:49:19 AM IST

శ్రీ‌కాకుళం అన‌గానే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వెన‌క‌బ‌డిన జిల్లాగా ప‌రిగ‌ణిస్తాం. రాజ‌ధానికి సుదూరంగా ఒడియా బార్డ‌ర్‌లో ఉందీ జిల్లా. అందుకే క‌ల్చ‌ర్ ప‌రంగా.. ఆర్థికంగా.. సామాజికంగా ఎంతో వెన‌క‌బాటులో ఉందన్న‌ది వాస్తవం. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం ఆ జిల్లా వెన‌క‌బాటున‌కు వేరొక కార‌ణం. అంతేకాదు.. శ్రీ‌కాకుళం యాస‌ను శీకాకుళం అంటూ సినిమావాళ్లు వెట‌కార‌మాడుతుంటారు. పెద్ద తెర‌పై శీకాకుళం యాస‌తో వెక్కిరింత‌గా .. కామెడీగా ఆ జిల్లా పాత్ర‌ధారుల్ని ఎలివేట్ చేస్తుంటారు. ఆ క్ర‌మంలోనే శీకాకుళం – శీకాకుళం బ‌యోపిక్ అంటూ కొత్త వార్త తెర‌పైకొచ్చింది.

శ్రీ‌కాకుళం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి వెయిట్‌లిఫ్ట‌ర్‌గా అసాధార‌ణ ప్ర‌తిభ‌ క‌న‌బ‌రిచింది. తినేందుకు తిండి లేని ప‌రిస్థితి. ఖ‌రీదైన ఆట‌ల్లో నెగ్గుకెళ్లాలంటే వ‌స‌తులు, సౌక‌ర్యాలు అస‌లే లేని స‌న్నివేశం నుంచి మ‌ల్లీశ్వ‌రి ఒలింపిక్ చాంపియ‌న్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిమంతం. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ సాధించిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి స్ఫూర్తితో ఆట‌పై ఆంధ్రుల్లో మ‌క్కువ పెరిగింది. అంత‌వ‌ర‌కూ ఒలింపిక్ అంటే అస‌లే తెలీని ఉత్త‌రాంధ్రకు ఓహో అదో అద్భుత‌మైన టోర్నీ అని అర్థం చేసుకున్నారు. అంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన మ‌ల్లీశ్వ‌రి జీవితంలో ఎమోష‌న్‌కు కొద‌వేం లేదు. అందుకే క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కిస్తాన‌ని డెబ్యూ ద‌ర్శ‌కురాలు సంజ‌న ప్ర‌క‌టించ‌గానే ఒక‌టే ఎగ్జ‌యిట్‌మెంట్. రాజుగాడు సినిమాతో ఈ న‌వ‌త‌రం ద‌ర్శ‌కురాలు టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయ్యారు. త‌న స్వ‌స్థ‌లం శ్రీ‌కాకులం టెక్క‌లి. అందుకే ఈ బ‌యోపిక్ పై సంజ‌న ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది.