ఛాయ్ క్వీన్.. ఛ‌ల్ రే ఛ‌ల్‌

Tuesday, May 29th, 2018, 02:14:26 PM IST

ఏయ్ ఛాయ్ .. చ‌టుక్కున తాగ‌రా భాయ్‌!
ఈ ఛాయ్ గ‌రీబుకి విందురా భాయ్‌!…

….మెగాస్టార్ సాంగ్ గుర్తొచ్చింది క‌దూ?… ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం కూడా అలానే ఉంది. వేడి వేడిగా చాయ్ కొడుతోంది. అంతేకాదు మీక్కూడా కావాలా… అన్న‌ట్టు ఫోజు కూడా పెట్టింది. ఇదిగో మ్యాడ‌మ్‌.. మ‌రీ అంత ఫోజు అఖ్క‌ర్లేదు. ఒక్క‌సారి ప‌టౌడీ కోట‌లు దాటి వ‌స్తే.. రోడ్డు ప‌క్క‌న టీకొట్లు, బ‌డ్డీ కొట్లు క‌నిపిస్తాయ్‌. అక్క‌డ మాబోటి గ‌రీబోళ్లు నిత్యం చేసే ప‌నే ఇది. గ‌ర‌మ‌గ‌ర‌మ ఛాయ్ కొడుతూ అందులో చెకోడి నంజుకు తిన్నంత మ‌జా ఏం ఉంటుందిలే!

మీరేమో.. ఖ‌రీదైన భ‌వంతుల్లో సొంత బార్‌లు పెట్టుక‌ని వైన్‌, వోడ్కాలు కాఫీ, టీల్లా తాగుతారు. మేమోమో.. చిల్ల‌ర టీకొట్ట‌నే బార్లుగా భావించి.. టీకొడుతుంటాం. ఆపాటి దానికి మ‌రీ ఇంత‌గా క‌వ్వించాలా? ప‌్లీజ్‌.. ఈ ఛాయ్ క‌వ్వింత‌లు ఆపేయ్‌వా ప్లీజ్!! వీరే ది వెడ్డింగ్ ప్ర‌చారంలో ఇదో త‌ర‌హా ప్ర‌చారం అన్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments