దానికి ఇంకా చాలా టైం ఉందంటున్న కరీనా ?

Thursday, September 13th, 2018, 11:44:03 PM IST


బాలీవుడ్ గ్లామర్ గర్ల్ అందరు ముద్దుగా బెబో అని పిలుచుకునే కరీనా కపూర్ పెళ్లి తరువాత ఓ బిడ్డకు తల్లి అవ్వడంతో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను చేసుకుని మొదటి బిడ్డకు తల్లయిన కరీనా కొడుకు పెద్దవాడు కావడంతో మళ్ళీ సినిమాల్లో బిజీగా మారింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి ఓ కార్యక్రమంలో ఆసక్తిగల ప్రశ్న ఎదురైంది .. ఆ ప్రశ్నకు తనదైన స్టైల్ లోనే సమాధానం ఇచ్చేసింది .. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో తెలుసా ? ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా మారారు .. కదా మరి రెండో బిడ్డను ఎప్పుడు ఇస్తారంటూ అడిగారు .. దానికి వెంటనే కచ్చితంగా రెండో బిడ్డను కూడా ఇస్తా .. కానీ దానికి ఇంకా టైం ఉందంటూ చెప్పేసింది. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పింది కరీనా.

  •  
  •  
  •  
  •  

Comments