పిక్ టాక్‌ : క‌వ‌ర్‌గాళ్స్.. క‌పూర్‌ సిస్ట‌ర్స్‌

Sunday, May 6th, 2018, 12:12:03 PM IST

క‌పూర్ల కుటుంబంలో ఈనెల 9న పెళ్లి భాజా మోగుతున్న సంగ‌తి తెలిసిందే. సోన‌మ్ క‌పూర్ తాను వ‌ల‌చిన ఆనంద్ అహూజాని పెళ్లాడేస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో క‌పూర్ గాళ్స్ అంతా చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. బోనీక‌పూర్‌, అనీల్ క‌పూర్‌ల జాయింట్ ఫ్యామిలీలో ఏకంగా ఆరుగురు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. వీళ్ల‌కు క‌రీనా, క‌రిష్మా వంటి అంద‌గ‌త్తెలు జాయింట్ అయ్యి అద‌ర‌గొట్టేస్తున్నారు.

ఓవైపు పెళ్లి కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్న సోన‌మ్ మ‌రోవైపు ఇదిగో ఇలా సిస్ట‌ర్స్‌తో క‌లిసి ప్ర‌ఖ్యాత బ్రైడ్స్ (ఇండియా టుడే) మ్యాగ‌జైన్ కోసం అదిరిపోయే ఫోజులిచ్చారు. సోన‌మ్ క‌పూర్‌, రియా క‌పూర్‌, క‌రీనా ఆ ముగ్గురూ పెళ్లి కూతుళ్లనే త‌ల‌పిస్తున్నారు ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో.