బెబో స్ట‌న్నింగ్ ఆస‌మ్‌..

Saturday, September 1st, 2018, 11:14:25 AM IST

బెబో క‌రీనాక‌పూర్ అంద‌చందాల గురించి ప్ర‌త్యేకించి వ‌ర్ణించాల్సిన ప‌నేలేదు. సైఫ్‌ని పెళ్లాడి తైమూర్‌కి మామ్ అయినా ఇంకా అందం పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. జీరోసైజ్‌ని ఇప్ప‌టికీ మెయింటెయిన్ చేస్తూ న‌వ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికిప్పుడు బాలీవుడ్‌లో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసి తీరిక లేనంత బిజీగా ఉంది.

ప‌నిలో ప‌నిగా బెబో ప‌లు మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌కు ఫోజులిచ్చింది. హెలో మ్యాగ‌జైన్ లేటెస్ట్ క‌వ‌ర్‌షూట్ అంత‌ర్జాలంలోకి రిలీజైంది. ఈ ఫోటోలో బెబో లుక్ అల్టిమేట్‌. అభిమానులంతా ఈ ఫోజుకు ఫిదా అయిపోయారు. అద్భుత‌మైన ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. బ్యూటిఫుల్‌.. జార్జియ‌స్‌.. స్ట‌న్నింగ్.. ఆస‌మ్ .. అంటూ కొంద‌రు పొగిడేస్తే, ల‌వ్‌లీ నేమ్ జానూ .. బీయింగ్ బోబో.. మై డియ‌ర్ యాంజెల్‌.. మై డియ‌ర్ సిండ్రెల్లా.. మై డియ‌ర్ క్వీన్.. మైడియ‌ర్ ప్రిన్సెస్‌.. మై డియ‌ర్ మూన్‌.. మై డియ‌ర్ స్టార్స్.. మై డియార్ షాజాన్‌.. అంటూ వేరొక వీరాభిమాని క‌విత‌లే అల్లేశాడు. మొత్తానికి ఆస‌మ్ బెబో లుక్ అనడంలో త‌ప్పేం లేదు. క‌రీనా ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న త‌క్త్ చిత్రానికి సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే.

Kareena Kapoor for Hello!

A post shared by Mickey Contractor (@mickeycontractor) on

  •  
  •  
  •  
  •  

Comments