ఫోటో టాక్‌: దేవేంద్రుడికే మైకం క‌మ్మాలి!

Thursday, May 10th, 2018, 05:38:49 AM IST

ఇలాంటి అంద‌మైన రూప‌లావ‌ణ్యం ఇదివ‌ర‌కూ ఇంకెక్క‌డైనా చూశారా? అంటే త‌డుముకోవాలి. వెంట‌నే ఫ‌లానా అని ఠకీమ‌ని చెప్పేయ‌లేం. దేవ‌తాసుంద‌రికి జెరాక్స్ కాపీలా… స్ట‌న్నింగ్ లుక్‌తో క‌ట్టిప‌డేస్తోంది బెబో క‌రీనా. అస‌లు బెబోకి ఆల్ట‌ర్నేట్ బ్యూటీ అన్న‌దే ఇల‌లో లేనేలేదు. నాచురంగు చీరలో మిరుమిట్లు గొలిపే ధ‌వ‌ళ‌కాంతితో ఆ చీర‌లోనే హంగుల‌న్నీ దాగి ఉన్నాయి. అయితే అంత‌కుమించి కరీనాని త‌ర‌చి చూస్తే, త‌న శారీర‌క శ్ర‌మ క‌నిపిస్తుంది. నిరంత‌రం ఆహార నియ‌మాలు పాటిస్తూ, పొట్ట క‌ట్టేసుకుని, జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ .. ప‌డే పాట్లు క‌నిపిస్తాయి.

అందం కాపాడుకోవ‌డం అంటే అంత ఈజీ కానేకాదు. కానీ బెబో మాత్రం అన్ని నియ‌మాలు పాటిస్తూ గ‌త ఏడాదిన్న‌ర‌గా ఎంత‌గా శ్ర‌మించిందో అర్థం చేసుకోవాలి. తైమూర్ రాజావారికి త‌ల్లిగా, సైఫ్‌కి భార్య‌గా అన్ని బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే సినిమాల్లో న‌టిస్తోంది క‌రీనా. ఇన్ని ప‌నులు స‌వ్యసాచిలా చేస్తూ.. ఇలా అందాన్ని కాపాడుకోగ‌లుగుతోంది అంటే నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి. సోన‌మ్ క‌పూర్ పెళ్లిలో న‌వ‌త‌రం నాయిక‌ల‌కు పోటీనిస్తూ బెబో ఇలా స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది.

Comments