క‌రీనా ఫోటోలు ఫేక్‌.. మార్ఫింగ్ దుమారం?

Friday, January 5th, 2018, 10:00:43 PM IST

సెల‌బ్రిటీల ఫోటోల్ని మార్ఫ్ చేయ‌డం.. వాటిని అశ్లీల వెబ్‌సైట్ల‌లో పోస్ట్ చేయ‌డం య‌థావిధిగా జ‌రుగుతున్న‌దే. దీనిపై గ‌తంలో ప‌లువురు క‌థానాయిక‌లు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. అయినా ఫోటోషాప్ మాయాజాలం, టెక్నాల‌జీ మానియాతో వీటిని ఆప‌లేని ప‌రిస్థితి. ఎప్ప‌టిక‌ప్పుడు భార‌త‌దేశంలో అశ్లీల శృంగార వెబ్‌సైట్ల‌ను నిలువ‌రించినా ఎవ‌రో ఒక క‌థానాయిక బాధితురాలిగానే బ‌య‌ట‌ప‌డాల్సి వ‌స్తోంది. కార‌ణం ఏదైనా ఈ విశృంఖ‌ల‌త్వం ఎదుర్కోక త‌ప్ప‌ని స‌న్నివేశం. అయితే అలాంటి గొడ‌వ కాదు కానీ, ఈసారి బెబో క‌రీనా కపూర్ ఫోటోలు మార్ఫ్ చేశారంటూ వెబ్‌లో ఓ రేంజులో ప్ర‌చారం సాగుతోంది.

మొన్న‌టికి మొన్న వోగ్ క‌వ‌ర్ పేజీపై క‌రీనా ద‌ర్శ‌న‌మిచ్చిన తీరును చూసి యువ‌ప్ర‌పంచం షాక్ తింది. అంతందం ఎలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంది. కొంద‌రైతే ఇదంతా మార్ఫింగ్ మాయాజాలం అంటూ కొట్టిపారేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో దీనిపై ఓ రేంజులో డిబేట్ సాగుతోంది. క‌రీనా ఫోటోల్ని ఫోటోషాప్‌లో మార్చేశార‌ని, ఆ న‌డుము చుట్టూ క‌నీసం స్ట్రెచెస్ కూడా క‌నిపించ‌డం లేదు. ఒక బిడ్డ త‌ల్లిలా క‌నిపించ‌డం లేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బెబో వాస్త‌వంగానే ఈ పోటోషూట్ కోసం ఎంతో శ్ర‌మించింది. అంత‌కుముందు డైట్ మెయింటెయిన్ చేస్తూ చాలానే జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేసింది. తిరిగి పాత రూపం ర‌ప్పించుకునేందుకు నానా ర‌కాలుగా శ్ర‌మించింది. ఆ క‌ష్టం గురించి ప్ర‌స్థావించ‌కుండా సామాజిక మాధ్యమాల్లో అడ్డ‌గోలుగా కామెంట్లు పెట్ట‌డం అన్యాయం అంటూ ప‌లువ‌రు రివ‌ర్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు. దీనిపై బెబో ఎలా స్పందిస్తుందో చూడాలి.