సౌత్ బ్రదర్స్ మల్టి స్టారర్!

Wednesday, June 13th, 2018, 06:54:54 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తీ సూర్య ఇద్దరు కూడా తెలుగులో మంచి ఆదరణను అందుకుంటున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో అన్న తో సమానంగా ఇంకా మార్కెట్ సెట్ చేసుకోలేదు గాని టాలీవుడ్ లో మాత్రం కార్తీ సూర్య స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు. ఇకపోతే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. అంటే మల్టీస్టారర్ అన్నమాట. వీళ్ళు చేసే చిత్రాన్ని బ్రదర్స్ మల్టీస్టారర్ అనవచ్చు.

సౌత్ లో పెద్ద స్టార్ బ్రదర్స్ ఎప్పుడు కూడా మల్టీస్టారర్ చేయలేదు. ఆ రికార్డును మొదట వీళ్లే అందుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని కార్తీ ఇటీవల కడాయ్ కుట్టి సింగం (చిన బాబు) ఆడియో రిలీజ్ లో ఈ విషయాన్ని చెప్పాడు. సూర్య చేస్తున్న రెండు సినిమాలు అయిపోగానే మా మల్టీస్టారర్ ఉంటుందని చెప్పేశాడు. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ అయిపోగానే బ్రదర్స్ మల్టి స్టారర్ గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments