మొత్తానికి .. ఆ సంస్థను గట్టెక్కించిన కార్తీ ?

Saturday, November 5th, 2016, 11:12:15 AM IST

kashmora1
కార్తీ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘కాష్మోరా’ మంచి టాక్ తో నడుస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం మొదటి వారంలో ఏకంగా 15 కోట్లు వసూలు చేసి కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు తమిళంలో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. పివిపి బ్యానర్ లో కార్తీ చేస్తున్న రెండో సినిమా ఇది. మొదట చేసిన ”ఊపిరి” సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కానీ వసూళ్ల పరంగా ఆ సినిమా ఓకే అనిపించుకుంది. పివిపి బ్యానర్ లో రూపొందిన సినిమాలు చాలా వరకు భారీ పరాజయాలను అందుకుని ఆ బ్యానర్ కు భారీ నష్టాలను మిగిల్చాయి. ముక్యంగా మహేష్ బాబు హీరోగా వచ్చిన ”బ్రహ్మోత్సవం” ఘోర పరాజయం పాలయింది. దాంతో పాటు చాలా సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఈ బ్యానర్ కు భారీ నష్టమే వచ్చింది. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన ‘క్షణం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది, వసూళ్ల పరంగా కాస్త బెటర్ అని చేప్పాలి. కానీ అది చిన్న బడ్జెట్ సినిమా కావడంతో .. వసూళ్లు కూడా అలాగే ఉన్నాయి. ఇక కార్తీ నటించిన ‘ఊపిరి’, ‘కాష్మోరా’ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ‘ఊపిరి’ ఓ మోస్తరు వసూళ్లను అందుకున్నా కూడా ‘కాష్మోరా’ మాత్రం మంచి విజయాన్ని అందుకుని కలక్షన్స్ పరంగా సేఫ్ గా ఉంది. మొత్తానికి పివిపి బ్యానర్ ను కార్తీ గట్టెక్కించాడు అని చెప్పక తప్పదు.