షాక్..ఆన్లైన్ లో కాటమరాయుడు లీక్..!

Tuesday, February 28th, 2017, 01:55:01 PM IST


టాలీవుడ్ లో లీకుల పరంపర కొనసాగుతోంది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాలకు సంబదించిన ముఖ్యమైన సీన్లు, ఫోటోలు లీకైపోతున్నాయి. పవన్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్న కాటమరాయుడు చిత్రానికి సంబందించిన కొన్ని ఫోటోలు ఆన్లైన్ లో లీకయ్యాయి. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సన్నివేశాలు గా చెప్పబడుతున్న ఫోటోలు ఎడిటింగ్ టేబుల్ నుంచి లీకైనట్లు తెలుస్తోంది.

పలు సందర్భాల్లో చిత్ర యూనిట్ లోని సభ్యులే ఇలా లీకులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఎడిటింగ్ జరిగే సందర్భంలో కాటమరాయుడు చిత్రానికి సంబందించిన ఫోటోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ చిత్రం అత్తారింటికి దారేది కూడా సగానికి పైగా లీకైపోయింది. అయినా దానిని తట్టుకుని ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.