ఫోటో టాక్‌: కాట‌మ‌రాయుడు 2017 గిఫ్ట్..

Saturday, December 31st, 2016, 12:28:44 PM IST

katamarayuda
కాట‌మ‌రాయుడు కొత్త సంవ‌త్స‌రం వేళ అభిమానుల‌కు కొత్త గిఫ్ట్ అందించాడు. అది కూడా న్యూలుక్ రూపంలో. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న కాట‌మ‌రాయుడు కొత్త పోస్ట‌ర్లు రిలీజైంది. పంచె క‌ట్టులో ప‌వ‌న్ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. కోర‌మీసం మెలేసిన‌వాడిలా.. కోపంగా చూస్తూ .. మెరుపులు మెరిపిస్తున్నాడు ఈ లుక్‌లో.

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రాయుడుని తెర‌పై డాలీ కొత్త‌గా ఆవిష్క‌రిస్తున్నాడ‌ని పోస్ట‌ర్లు చెబుతున్నాయి. డిసెబ‌ర్‌ 31 రాత్రి సంబ‌రాల‌కు, జ‌న‌వ‌రి 1 ఉత్స‌వాల‌కు రెడీ అవుతున్న అభిమానుల‌కు కాట‌మ‌రాయుడు పంపించిన గిఫ్ట్ ఇద‌ని చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments