కాటమరాయుడు వెనక్కి వెళ్ళాడుగా ?

Tuesday, January 24th, 2017, 10:54:38 AM IST

katamarayuda
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 26న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అది వర్కవుట్ అయ్యేలా లేవు. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి సినిమాకు అంతరాయాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు షూటింగ్ ఆలస్యం అవుతూ .. వస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ప్రజలకు దగ్గరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 26న వైజాగ్ లోని ఆర్ కె బీచ్ లో స్టూడెంట్స్ కలిసి ఆంధ్రా కు స్పెషల్ స్టేటస్ కోసం ర్యాలీ చేస్తున్నందుకు వారికీ మద్దతు తెలిపాడు పవన్. అందుకనే ఆ రోజు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం లేదని యూనిట్ తెలిపింది? త్వరలోనే మరో డేట్ ప్రకటిస్తారట !!