విడుదల కి ముందే బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన పవన్ సినిమా

Wednesday, February 15th, 2017, 12:14:19 PM IST


పవన్ కళ్యాణ్ – డాలీ ల కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన గోపాల గోపాల పెద్ద డిజాస్టర్ కావడం తో ఎవ్వరూ కాటమరాయుడు మీద పెద్ద నమ్మకాలు పెట్టుకోలేదు. వారం రోజుల క్రిందట టీజర్ ట్రైలర్ రాక ముందు వరకూ ఇలా ఉంది పరిస్థితి కానీ ఒక్కసారిగా టీజర్ తో పవన్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 1 ల్యాక్ వ్యూస్.. ఇలా యూట్యూబ్ లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని మరో రికార్డును ‘కాటమరాయుడు’ టీజర్ అందుకుంది. యూట్యూబ్ లో 2 లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డు నెలకొల్పింది. ఇది ‘బాహుబలి’ లాంటి మెగా మూవీకి కూడా సాధ్యం కాని ఘనత. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా ఈ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాయి.