వీడియో : టైటానిక్ లో రొమాన్స్ అలా పండించిందట !

Monday, December 4th, 2017, 03:19:02 PM IST

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టైటానిక్ ఒకటి. ఆ సినిమా ఏ స్థాయిలో రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమా గురించి ఈ మధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా చిత్ర హీరోయిన్ స్టీఫెన్ కోల్బ‌ర్ట్ ప్రముఖ లేట్ నైట్ షోలో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ సినిమాలో ‘మై హార్ట్ విల్ గో ఆన్’ అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ పాట‌ను మాత్రం అస్స‌లు విన‌న‌ని అన్నారు. సినిమాలో రోస్ బొమ్మ‌ను ద‌ర్శ‌కుడు జేమ్స్ కేమెరూన్ గీశాడని చెబుతూ.. ఆ సిన్ వచ్చినప్పుడు థియేటర్ లో ఓ సారి తన కుమారుడి కళ్లు ముసినట్టు చెప్పారు. అంతే కాకుండా మొదట ఆ సినిమాలో హీరో (జాక్) పాత్రకు మొదట లియోనార్డో డికాప్రియో కాకుండా మాథ్యూ మెకానేని సెలెక్ట్ చేశారు. అత‌నితో క‌లిసి ఆమె ఆడిష‌న్ కూడా చేసిన‌ట్లు తెలుపుతూ.. ఆ తర్వాత అన్ని మారిపోయాయని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments