త్రివిక్రమ్ కాపీకొట్టాడు.. పవన్ మోసం చేస్తున్నాడు : కత్తి మహేష్ కామెంట్స్

Saturday, January 6th, 2018, 12:40:57 PM IST

ఎవరు స్పందించినా స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ ప్రతి విషయంపై కామెంట్స్ చేస్తోన్న కత్తి మహేష్ ఈ సారి మరో కామెంట్ తో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాడు. అదే విధంగా అతనికి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అయితే పవన్ రాజకీయాల గురించి కాకుండానే ఇప్పుడు ఆయన సినిమా అజ్ఞాతవాసిపై కూడా కత్తి మహేష్ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నాడు. సినిమా ప్రీమియర్ షోల గురించి అలాగే సినిమా కాపీ అయ్యిందంటూ మరికొన్ని ట్వీట్స్ కూడా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ప్రమియర్స్ షోల గురించి స్పందిస్తూ.. అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా షోలు కూడా పర్మిటెడ్. ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి. కానీ పాపం అంటూ చెప్పడంతో నెటిజన్స్ విమర్శలు చేశారు.అయితే బాహుబలి అలాగే ఇతర భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ప్రీమియర్స్ షో వేశారుగా అప్పుడు ఎందుకు స్పందించలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సీనిమా కాపీ అయ్యిందని మరొక ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ సినిమాని కాపీకొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి. టి.సిరీస్ వేసిన కేసుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యలేక. సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తేలిక సతమతం అవుతున్న నిర్మాత. చాలా బాధాకరమైన వార్త. కానీ ఏం చేద్దాం! అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే!! అని కత్తి మహేష్ ట్వీట్ చేశాడు.