నా కారు మీద దాడికి ప్రయత్నం జరిగింది : కత్తి మహేష్

Saturday, April 21st, 2018, 04:59:16 PM IST

టాలీవుడ్ కి చెందిన నిర్మాతలు, దర్శకులు అలాగే నటులతో పాటు 24 క్రాఫ్ట్స్ కు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ రోజు అన్నపూర్ణా స్టూడియోలో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ముందుగా పవన్ పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. ఇక సినీ పెద్దలు సమావేశంలో చర్చించిన అంశాలను అలాగే తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు తెలుపలేదు.

అయితే స్టూడియో దగ్గర కత్తికి మహేష్ రావడంతో అక్కడ కొంత ఆందోళన చెలరేగింది. కొంత మంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ కత్తి మహేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కత్తి మహేష్ కి ఆందోళన చేసే వారికీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కొంత మంది పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయం గురించి కత్తి మహేష్ ఫెస్ బుక్ ద్వారా స్పందించారు. పవన్ ఫ్యాన్స్ దాడికి ప్రయత్నించారని కామెంట్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ లేడు. 24 క్రాఫ్ట్స్ మీటింగ్ లేదు. నేను అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘జై పవర్ స్టార్’ అని నినాదాలు చేశారు. నా కారు మీద దాడికి ప్రయత్నం జరిగింది’ అని కత్తి మహేశ్‌ ఫెస్ బుక్ లో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments