వర్మ పై కత్తి మహేష్ చమక్కులు !

Saturday, February 3rd, 2018, 05:22:17 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్, కు సినీ విశ్లేషకులు కత్తి మహేష్ కు మధ్య జరిగిన వివాదం చివరకు ఇరు వర్గాలు కలిసి పార్టీ చేసుకునే దిశగా రాజీ కుదిరిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి పవన్ పై కత్తి విమర్శలు చేయనప్పటికీ, అప్పుడప్పుడు ఆయనకు పరోక్షంగా కొన్ని ప్రశ్నలు సంధించడం చూస్తున్నాం. ఆ సమయంలో విడుదలైన పవన్ అజ్ఞాతవాసి పై ఒక రివ్యూ వీడియో విడుదల చేశారు కత్తి, కత్తి మహేష్ రివ్యూ ఇచ్చిన ఆ వీడియో పై సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కంటే కత్తి మహేష్ చాలా అందగాడని పొగిడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వర్మ పెట్టిన ఒక ట్వీట్ పై కత్తి తనదైన రీతిలో స్పందించారు. మనం తీసుకునే నిర్ణయం కాస్త లేట్ అయిందంటే మన సమయంలో కొంత వేస్ట్ అయినట్లే. టైం వేస్ట్ అయిందంటే దాని అర్ధం మన జీవితం వేస్ట్ అయినట్లే అని టైం వెస్టెజ్ గురించి వర్మ ట్వీట్ చేశారు. దీని పై స్పందించిన కత్తి మహేష్ మీరు లైఫ్ వేస్ట్ చేసుకోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు, ఆ విషయం లో మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా వుంది అని చమత్కరిస్తూ ట్వీట్ చేశారు….