బిగ్ బ్రేకింగ్ : ఈసారి జగన్ పై కత్తి మహేష్ సంచలనం..అభిమానులు ఏమంటారో?

Monday, June 3rd, 2019, 03:37:51 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తాను చెప్పిన మాట ప్రకారం కేవలం 6 నెలల్లోనే మంచి సీఎం అని అనిపించుకునేలా పనులన్నీ శర వేగంగా కావిస్తున్నారు.ఇదిలా ఉండగా జగన్ పై విమర్శలు చేసే వారు కొంతమంది మాత్రం చేస్తూనే ఉన్నారు.తాజాగా మాత్రం గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కత్తి మహేష్ ఇప్పుడు జగన్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.

రోజులు మారుతున్న కొద్దీ టీడీపీ ప్రభుత్వం కేవలం కులపరమైన రాజకీయాలు మాత్రమే చేస్తూ వచ్చింది అని చంద్రబాబుకి తెలిసి జరిగాయో లేక తేలికా జరిగాయో కానీ వారి సామాజికవర్గానికి చెందిన నేతలు మాత్రం అసలు అమరావతి వారి సామాజికవర్గందే అని వారు చెప్పుకుంటూ తిరిగేవారని అన్నారు.అంటే ఆంధ్ర రాష్ట్రంలో వారు తప్ప ఇంకెవ్వరు లేరా అని ప్రజలంతా సరైన దెబ్బ కొట్టారని అన్నారు.

ఇదే విషయంలో కానీ వైసీపీ నేతలు మరియు జగన్ కూడా వారి సామాజికవర్గం వర్గం వలనే ఆంధ్ర రాష్ట్రం మరియు అమరావతి అభివృద్ధి చెందుతున్నాయి అని వారి పేరు కానీ పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు చంద్రబాబుకి పట్టిన గతే వచ్చే ఐదేళ్ల తర్వాత జగన్ కు కూడా పడుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు.మరి దీనిపై జగన్ అభిమానులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.