త్రివిక్రమ్ – పవన్ తాంత్రిక పూజలు చేశారా?..అంతా అబద్ధమేనా?

Tuesday, January 9th, 2018, 04:00:59 PM IST

గత కొంత కాలంగా సాగుతోన్న కత్తి మహేష్ పవన్ అభిమానుల వివాదం ఏ స్థాయిలో చెలరేగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కత్తి మహేష్ ఇటీవల కొన్ని ప్రశ్నలను బయటపెట్టి అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు డిబేట్ లు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అందులో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని ఆరోపణలు చేశారు. అయితే ఆ విషయాల్లోకి వెళితే అసలు నిజాలు బయటపడ్డాయి. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు మొత్తం అబద్దమని తేలింది.పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్.జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయనికి త్రివిక్రమ్ తరచు వెళుతుంటారు.

అంతే కాకుండా ప్రతి ఏటా మహా సంపుటిత అలాగే శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన యాగం నిర్వహించడం ఆనవాయతీ. త్రివిక్రమ్ ఏ సినిమా చేసిన అందుకు సంబందించిన చిత్ర యూనిట్ కూడా వెళుతుంది. కేవలం భక్తి పరంగా అందరికి శాంతి కలగాలని చేసేదే ఆ యాగం. ఆ విషయాన్ని నలుగురికి చెప్పుకోవలసిన అవసరం లేదు. కేవలం చిత్ర యూనిట్ మొత్తం ఆ యాగంలో పాల్గొంది. కానీ కత్తి మహేష్ దాన్ని చెడుగా జనాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అక్కడి ఆలయ నిర్వాహకులు కూడా అది మంచి యాగం అని మీడియాకు వివరించారు. ప్రస్తుతం అందుకు సంబందించిన కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. మరి ఈ విషయంపై కత్తి మహేష్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.