బాబు దగ్గర తైలం అయిపోయిందా యామిని…దారుణమైన వ్యాఖ్యలు చేసిన కత్తి

Wednesday, August 21st, 2019, 11:04:44 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు మీడియా అటెంక్షన్ పొందుతూ ఉంటాడు కత్తి మహేష్. గత రెండు రోజుల నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలకెక్కుతున్నాడు. పవన్ కళ్యాణ్ 130 కోట్లు పెట్టి ఇల్లు కొన్నుకున్నాడంటూ ఆరోపణలతో నిప్పు రాజేసి, జనసైనికులతో చివాట్లు తింటున్న కత్తి మహేష్ ఇంకా ఆ వివాదం తగ్గకముందే మరో వివాదానికి ఆజ్యం పోశాడు. తాజాగా టీడీపీని విడి బీజేపీ లోకి వెళ్లిన యామిని సాధినేనిని,నటి దివ్యవాణిని ఉద్దేశించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశాడు.

“సాధినేని యామిని,నటి దివ్యవాణి ఎంతైనా బ్రతకనేర్చిన వనితలు. బాబుగారి తైలం అయిపోయిందని గ్రహించి కన్నా గారి తాయిలాల కోసం బీజేపీలోకి చొరబడ్డారు. చంద్రబాబు గారు నేర్పించింది సరిగ్గా ఒంటబట్టించుకున్న మంచి శిష్యురాళ్లు వీళ్ళు. వారికి నా అభినందనలు”. అంటూ మాట్లాడాడు కత్తి మహేష్ . ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి, అసలే ఫైర్ బ్రాండ్ అయినా యామిని సాధినేనిని గెలికాడు కత్తి. మరి దానిపై ఆమె ఏ విధంగా స్పదింస్తుందో చూడాలి.

ఎవరిని గెలికితే ఫేమ్ వస్తుందో, అని పక్కాగా తెలిసిన కత్తి వలనే టార్గెట్ చేస్తూ మాట్లాడి అందరి ఫోకస్ తనమీదకి రావాలని కోరుకుంటున్నాడు. కత్తి మహేష్ కిటుకులు తెలిసిన చాలా మంది అతని వ్యాఖ్యలకి స్పందించకపోవటమే బెటర్ అనుకోని సైలెంట్ గా ఉంటున్నారు. అయినా కత్తి ఇంకెప్పుడు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వలన లాభం లేదని గ్రహిస్తాడో ఏమో