జీరో చిత్రంలో దేశీ లుక్ లో కత్రినా… వైరల్ అయిన ఫోటోలు…

Wednesday, March 7th, 2018, 11:30:47 AM IST

గత కొద్దికాలంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ తాజా సినిమా “జీరో” అభిమానుల‌లో క్రేజీ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త ఫ్యాన్స్ లో అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా ఉంటుంద‌ని సినీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో షారూఖ్ కథకి ప్రాధాన్యతనిస్తూ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. 2018 డిసెంబర్ 21న ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ సరసన అనుష్మ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 2012లో వచ్చిన “జబ్ తక్ హై జాన్” సినిమాతో అలరించిన ఈ కాంబో, ఇప్పుడు జీరో కోసం మరోసారి జతకట్టారు. ఇందులో అనుష్క మానసిక స్థితి సరిగా లేని యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే మ‌రో హీరోయిన్ క‌త్రినా పాత్ర‌కి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కి రాక‌పోయే స‌రికి క‌త్రినా ఏ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే దానిపై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌త్రినాకి సంబంధించి కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ముక్కుకి ముక్కెర పెట్టుకొని దేశీ లుక్‌లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.