ఫోటో టాక్ : మాజీ లవర్స్ పిచ్చ హాట్ గా..!

Saturday, December 2nd, 2017, 01:25:41 AM IST

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లిద్దరూ మాజీ ప్రేమికులన్న సంగతి సినిమా ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. కండల వీరుడితో కత్రినా రొమాన్స్ ఓ రేంజ్ లో సాగింది. ఆ తరువాత వీరి ప్రేమ బ్రేక్ అప్ అయింది. కానీ కత్రినా, సల్మాన్ వృత్తి పరంగా స్నేహితులుగానే ఉన్నారు. తామిద్దరం మాజీ ప్రేమికులం అన్న సంగతి పక్కన పెట్టిన ఈ జంట తాజాగా టైగర్ జిందా హై చిత్రంలో రొమాన్స్ పండించారు. ఇది ఒక ఎత్తయితే హాట్ ఫోటో షాట్ లో పాల్గొని ఘాటు రేపడం మరో ఎత్తు.

వోగ్ మ్యాగజైన్ కోసం సల్మాన్, కత్రిన ఇచ్చిన ఫోజు అభిమానుల చేత కేక పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో షూట్ సంచలనంగా మారింది. బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న కత్రినా సల్మాన్ ని కౌగలించుకుని ఉన్న ఫోజు అదుర్స్.

  •  
  •  
  •  
  •  

Comments