వీడియో : యూట్యూబ్ బద్దలు కొడుతోన్న మాజీ ప్రేమికుల రొమాన్స్ !

Monday, December 4th, 2017, 05:40:13 PM IST

కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై చిత్రం డిసెంబర్ 22 న విడుదుల కాబోతోంది. చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ తో ఈ చిత్రంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా మాజీ ప్రేమికులు సల్మాన్, కత్రిన కైఫ్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన వీరి రొమాంటిక్ స్టిల్స్ సినీ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే స్వాగ్ సే స్వాగత్ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. దానిని అభిమానులు ఆస్వాదించేలోపే మరో సాంగ్ ని విడుదల చేయడం విశేషం.

సల్మాన్, కత్రిన దిల్ దియాన్ అంటూ సాగే ఈ సాంగ్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తూ చేస్తున్న రొమాన్స్ తెగ అకకట్టుకుంటోంది. సాంగ్ లోని అందమైన లొకేషన్లు సల్మాన్, కత్రినా మధ్య సాగుతున్న హెల్తీ రొమాన్స్ హైలైట్ గా నిలిచాయి. మాజీ లవర్స్ చెలరేగిపోతున్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments