పెళ్ళికి ముస్తాబయిన కత్రినా…

Wednesday, April 11th, 2018, 04:30:40 PM IST

కుర్రాళ్ళ స్వప్న సుందరి, బాలీవుడ్‌ బార్బీ గర్ల్ కత్రినా కైఫ్‌ పెళ్లికూతురయ్యారు. అంటే ‘మల్లీశ్వరి’ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకోకండి, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ‘టైగర్‌ జిందా హై’ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న కత్రినా కైఫ్ ప్రస్తుతం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ‘జీరో’లో కత్రినా విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సినీ వర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కత్రినా పెళ్లి కూతురు గెటప్‌ వేసుకున్నారు. ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..‘ఈరోజు ‘జీరో’ కోసం. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ ఫొటో తీశారు’ అని ఓ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటోతో పాటు ఫ్యాన్స్‌ షేర్‌ చేసిన మరిన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో గిర గిరా చక్కర్లు కొడుతున్నాయి.

‘జీరో’ సినిమాకు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వం వహించగా ఎదే సినిమాలో కత్రినాతో పాటు అనుష్క శర్మ కూడా మరో కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో కన్పించనున్నారు. ఇందులో కత్రినా మద్యానికి బానిసైన యువతి పాత్రలో నటిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాను వచ్చే డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు ముందుకు తీసుకురావడానికి సర్వత్రా సిద్దం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments