సల్మాన్ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్న హీరోయిన్ ?

Friday, April 6th, 2018, 02:11:57 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోర్టు జింకల కేసులో ఐదేళ్లు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1998 లో రాజస్థాన్ లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా సమయంలో అక్కడ పక్కనే ఉన్న అడవిలో వేటకెళ్లిన వాళ్లలో సైఫ్ అలీఖాన్ , సల్మాన్, టబు, సోనాలి బెంద్రే , తదితరులు ఉన్నారు .. మిగతా వాళ్ళను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల శిక్షను విధిస్తు తీర్పు చెప్పింది. ఈ సందర్బంగా సల్మాన్ కోసం ప్రత్యేక పూజలు చేసింది బాలీవుడ్ హీరోయిన్ కత్రిన కైఫ్. ముంబై లోని సిద్ది వినాయక ఆలయానికి సల్మాన్ సోదరితో కలిసి వెళ్లిన కత్రినా ప్రత్యేక పూజలు చేయడం విశేషం. సల్మాన్ ప్రస్తుతం రాజస్థాన్ జిల్లా కేంద్ర జైలు లో ఉన్నారు.